హీరోయిన్ అభినయ తార 'అర్చన' పుట్టిన రోజు
- July 27, 2017
అభినయ తార అర్చన పుట్టిన రోజు
చుక్కల్లే తోచావే.. ఎన్నెల్లే కాచావే.. ఇన్నియేల చుక్కల్లో అనే పాట వింటే చాలు.. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ శృంగారానికి, వల్గారిటీకి మధ్య ఉన్న గీతను చెరిపేస్తూ.. ఆ రూపం మురిపిస్తుంది. రంగు తక్కువే కానీ.. రంగంలోకి దిగితే ఆమె ప్రతిభ ముందు ఇంకెవరూ నిలవరు. అందుకే అనేక అవార్డులు ఆ నటనకు దాసోహమన్నాయి. నవ్వితే నవరత్నాలు మెరిసినట్టు కనిపించే ఆ రూపం పేరు అర్చన. చేసింది చాలా తక్కువ సినిమాలు.. కానీ తన నటనతో చాలా కాలం గుర్తుంచుకునేలా అద్భుత ప్రతిభ చూపింది అర్చన. ఇవాళ అర్చన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ ఇవాల్టి ఫేవరెట్ ఫైవ్.
డీ గ్లామర్ పాత్రలు
తమిళంలోనూ 'నిరీక్షణ' మంచి హిట్ అయింది. తర్వాత కూడా అలాంటివే మరికొన్ని డీ గ్లామర్ పాత్రలు చేసింది. దీంతో అర్చన అంటే గ్లామరస్ పాత్రలకు పనికి రాదన్నారు కొందరు. వారికి సమాధానంగా తెలుగులో 'లేడీస్ టైలర్' చేసింది. ఇందులో ఇతర పాత్రలు ఎంత ఎక్స్ పోజ్ చేసినా.. అర్చన ముందు బలాదూర్ అయిపోయారు. అంత గ్లామరస్ గా నటించిందీ సినిమాలో. అయితే కథానుసారంగానే తప్ప.. కావాలని ఎప్పుడూ హద్దులు దాటలేదు అర్చన.
ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు
అర్చన.. చూడగానే కళ్లు తిరిగిపడిపోయేంత అందగత్తె కాకపోవచ్చు.. కానీ కళ్లు చెమర్చే నటన చూపించగలదు. పాత్రలో లీనమై.. మనల్నీ ఆ పాత్రలో లీనం చేయగల మోస్ట్ టాలెంటెడ్ గాళ్ తను. అందుకే వరుసగా రెండేళ్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు అందుకోగలిగింది. ఓ ప్రాంతీయ చిత్ర నటికి ఇలాంటి గౌరవం దక్కడం ఆశ్చర్యమే. తెలుగులో వచ్చిన 'దాసి', తమిళంలో చేసిన 'వీడు' చిత్రాలకు ఆమె జాతీయ అవార్డులు అందుకుంది. అంతకు ముందు వరుసగా రెండు జాతీయ అవార్డులు సాధించిన ఘనత సాధించిన నటి శారద మాత్రమే కావడం విశేషం.
తమిళ్ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ స్టూడెంట్
మన హీరోయిన్లు దక్షిణాదిలో పేరు తెచ్చుకుని బాలీవుడ్ కు వెళతారు. కానీ అందుకు భిన్నంగా అర్చన మాత్రం 1973లోనే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'యాదోం కి బారాత్' లో నటించి, తర్వాతే సొంత గడ్డకు వచ్చింది. అంటే ముందు రచ్చగెలిచి ఆ తర్వాతే ఇంటికి వచ్చిందన్నమాట. ఫస్ట్ తమిళ్ లో ఫేమ్ అయిన అర్చన తెలుగు ఫ్యామిలీ అమ్మాయే. అయితే అర్చన తమిళనాడు ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీలో యాక్టింగ్ కోర్స్ లో గ్రాడ్యుయేట్ అన్న విషయం చాలామందికి తెలియదు..
తాజా వార్తలు
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్‌లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్‌లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు









