186 మంది అక్రమ టాక్సీ డ్రైవర్లు అరెస్టు

- July 27, 2017 , by Maagulf
186 మంది అక్రమ టాక్సీ డ్రైవర్లు అరెస్టు

 వివిధ దేశాలకు చెందిన 186 మంది చట్టవిరుద్ధమైన టాక్సీ డ్రైవర్లను ఫిబ్రవరి 22 వ తేదీ నుంచి జూన్ 30 వ తేదీ వరకు అరెస్టు చేశారు. గురువారం ట్రాఫిక్ డిప్యూటీ జనరల్ డైరెక్టర్ మాట్లాడుతూ, వారినందరిని  పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్దకు పంపించగా ఆయన వారికి జరిమానాలు జైలుశిక్ష విధించారు. వారిలో  బహ్రెయిన్లు కానీ వారిని దేశ బహిష్కరణ విధించారు. న్యాయబద్దంగా నమోదు చేసుకున్న బహ్రెయిన్ టాక్సీ డ్రైవర్ల జీవనోపాధిని అణచివేసే ఇటువంటి ఉల్లంఘనలను భద్రతా డైరెక్టరీస్ మరియు సంబంధిత అధికారులతో సహకరిస్తూ పర్యవేక్షిస్తుంది. నియమాలను ఉల్లంఘించినవారిపై ప్రచారాన్నినిర్వహించడాన్ని కొనసాగిస్తుంది. చట్టవిరుద్ధ టాక్సీ డ్రైవర్లతో  కఠినంగా వ్యవహరించడం ద్వారా కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com