ఉమాజాజ్ లో 700,000 క్యాప్కాన్ మాదకద్రవ్య మాత్రలు పట్టివేత

- July 29, 2017 , by Maagulf
ఉమాజాజ్  లో 700,000 క్యాప్కాన్ మాదకద్రవ్య మాత్రలు పట్టివేత

గురువారం టాబుక్ లోని ఉమ్లాజ్ ప్రాంతంలో సరిహద్దు గస్తీ దళం ప్లాస్టిక్ గొట్టాలలో రహస్యంగా  దాచిపెట్టిన 700,000 ఆమ్ఫెటమిన్ మాత్రలను అక్రమ రవాణను అడ్డుకొన్నారు. సరిహద్దు గార్డు ప్రతినిధి అయిన సాహెర్ బిన్ మహ్మద్ అల్-హర్బి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్లాజ్ అధికార పరిధిలోని ఒక ద్వీపంలో నీటి ఉపరితలంపై రబ్బరుతో ముడి వేసి ఉన్న కొన్ని ప్లాస్టిక్ గొట్టాలు అనుమానాస్పదంగా  గుర్తించినపుడు  సముద్రపు గస్తీదళం వాటిని చుట్టుముట్టినట్లు  పేర్కొన్నారు. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న గస్తీ మరియు నౌకాదళ గస్తీలను మద్దతు ఇచ్చేవారు మరియు నీటిలో వెతికే గజ ఈతగాళ్ళ సహాయంతో పూర్తిగా ఈ ప్రాంతాన్ని వెతకడానికి తీసుకువచ్చారు. వారు నీటిలో  రెండు చివరలు మూసివేసిన ప్లాస్టిక్ గొట్టాలను 372 ప్లాస్టిక్ సంచులను కనుగొన్నారు. అందులో 700,000 కంటే ఎక్కువ క్యాప్టన్ మాత్రలను  స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలపై మరిన్ని చర్యలకు అధికారులకు అప్పగించాయని అల్ హర్బీ చెప్పారు. అక్రమ మాదక ద్రవ్యాల  రవాణాదారుల పదేపదే చేస్తున్న ప్రయత్నాల్లో ఉపయోగిస్తున్న అనేక పద్ధతులకు ధీటుగా  సరిహద్దు గస్తీ దళం రాజ్యంలో అక్రమ మాదక ద్రవ్యాలను అదుపు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని  ఆయన అంన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com