మరోసారి రిపీట్ కాబోతున్న కుమారి 21 ఎఫ్ కాంబినేషన్
- July 29, 2017
చిన్న చిత్రాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం కుమారి 21 ఎఫ్. జీనియస్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం అప్పట్లో హాట్‌టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ రైటింగ్స్ సంస్థ నుంచి రానున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు ఆగస్టు 4న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తరుణంలో సుకుమార్ రైటింగ్స్ సంస్థ మరో తాజా చిత్రానికి షెడ్యూల్ ప్రిపేర్ చేస్తోంది.
కుమారి 21ఎఫ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. ఈ సినిమాకు కూడా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించి మ్యజిక్ చేయబోతున్నాడు. కుమారి 21ఎఫ్ తో కెరీర్ గ్రాఫ్ ను తారాజువ్వలా దూసుకెళిపోతున్న సంగతి తెలిసిందే. రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. కుమారి 21ఎఫ్ చిత్రంతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న పల్నాటి సూర్యప్రతాప్ ఈ నూతన చిత్రానికి దర్శకుడు. వైవిధ్యమైన కథలకు చిరునామాగా చెప్పుకునే ప్రముఖ దర్శకుడు సుకుమార్ అందిస్తున్న కథతో సుకుమార్ రైటింగ్స్ అండ్ రేష్మాస్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని సుకుమార్‌తో కలిసి విజయ ప్రసాద్ బండ్రెడ్డి, సునీత-రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తారు. సహ నిర్మాత శ్రీ తులసి బండ్రెడ్డి.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







