పేపర్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం, 6 గురు అగ్నిమాపక దళ సిబ్బందికి గాయాలు

- July 29, 2017 , by Maagulf
పేపర్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం, 6 గురు అగ్నిమాపక దళ సిబ్బందికి గాయాలు

అల్-అహ్మది గవర్నరేట్ పరిధిలో పేపర్ ఫ్యాక్టరీ మరియు గిడ్డంగి వద్ద శుక్రవారం  భారీ అగ్నిప్రమాదం జరిగింది. కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) అగ్నిమాపక యంత్రాంగం సంఘటనా స్ధలానికి చేరుకోని ఎగిసిపడుతున్నమంటలను నియంత్రణలో ఉంచారు. శుక్రవారం జారీ చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంటూ, ఐదు అగ్నిమాపక సేవ స్టేషన్ల నుండి అగ్నిమాపకదళ సిబ్బంది తమ నిర్విరామ సేవలను అందించారని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) తెలిపింది. సమీప భవనాలకు ఈ మంటలు వ్యాపించకుండా ఎగిసిపడుతున్న ఆ అగ్నిని అణచివేయడానికి సిబ్బంది ఎంతగానే శ్రమించింది. ఆ అగ్నిని నియంత్రిస్తున్న సమయంలో ఆరుగురు అగ్నిమాపకదళ సిబ్బంది గాయపడ్డారని తెలిపింది.  పేపర్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలను వెల్లడి చేయటానికి ఒక దర్యాప్తుని  ప్రారంభించారు.  కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) ప్రస్తుత  డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్-మహమెద్  " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధి తో మాట్లాడుతూ 4000 చదరపు మీటర్ల భవనంలోని 2,500 చదరపు మీటర్ల ప్రాంతం అగ్ని ప్రమాదం వలన నష్టపోయినట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com