ప్రధాన రహదారి మూసివేతలు, దుబాయ్ విమానాశ్రయ రహదారిపై ట్రాఫిక్ మళ్ళింపు
- July 29, 2017
మళ్లింపు పనులు ప్రాంతం యొక్క విభజనలపై ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపర్చడానికి ఉద్దేశించిన విమానాశ్రయ రహదారి మెరుగుదల పథకం మొదటి ఒప్పందంలో భాగంగా డీరా-బౌండ్ వాహనదారులు రాషిదీయ ఇంటర్ చేంజ్ వద్ద కొత్త ట్రాఫిక్ మళ్లింపును తీసుకోవాలని అధికారులు సూచించారు. విమానాశ్రయం రోడ్డులో డీరా- బౌండ్ ట్రాఫిక్ లోని వాహనదారులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ మరియు అల్ ఖ్వీవీజ్ రహదారి నుండి వచ్చే వాహనదారులను నూతన ఫ్లైఓవర్ కు మళ్లించనున్నట్లు దుబాయ్ రోడ్ల మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) గత బుధవారం ప్రకటించారు. మళ్లింపు పనులు విమానాశ్రయం రోడ్డు మెరుగుదల పథకం పనులలో మొదటి ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతం యొక్క రహదారుల విభజనలపై ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపర్చడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ అని యొక్క ట్రాఫిక్ మరియు రోడ్స్ ఏజెన్సీ యొక్క సీఈఓ మాథా బిన్ అడాయ్ వివరించారు."విమానాశ్రయ రోడ్డు అభివృద్ధి ప్రాజెక్ట్ లో భాగంగా గంటకు మరో అదనపు 5,000 వాహనాల సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ భద్రత స్థాయిని మెరుగుపరుస్తుంది మరియు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ నుండి కాసాబ్లాంకా రోడ్ వరకు 30 నిమిషాల నుండి ఐదు నిమిషాల సమయాన్నీ ఈ రవాణా మార్గంలో తగ్గించవచ్చు. "ఎయిర్పోర్ట్ రోడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటి ఒప్పందం రషీడియా మరియు కాసాబ్లాంకా ఇంటర్ చేంజ్ మరియు ప్రాజెక్ట్ పూర్తిగా సిద్ధమయ్యేసరికి ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







