తీవ్రవాదానికి ఖతార్ మద్దతు: ఇదే సాక్ష్యం!
- July 29, 2017
దుబాయ్: ఎమిరేటీ స్టేట్ టెలివిజన్ ఛానల్ విడుదల చేసిన ఓ డాక్యుమెంటరీ, ఖతార్ ఎలా తీవ్రవాదులకి, తీవ్రవాద సంస్థలకు మద్దతిస్తోందన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. అల్ ఇస్లా అనే నిషేధిత ఇస్లామిస్ట్ గ్రూప్‌కి మద్దతిస్తున్నందుకు ఏడేళ్ళ జైలు శిక్షకు గురైన ముహమౌద్ అల్ జైదా మాట్లాడిన మాటలు ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఖతార్ అల్ ఇస్లా గ్రూప్‌కి మద్దతిచ్చిందనీ, ఈ గ్రూపు సభ్యులకు హోటల్ అకామడేషన్స్ ఏర్పాటు చేసిందని ఆ డాక్యుమెంటరీలో మహమౌద్ అల్ జైదా పేర్కొన్నాడు. తీవ్రవాద సంస్థలకు, గ్రూపులకు, అలాగే ఆందోళనకారులక అవసరమైన మెటీరియల్‌ని కూడా ఖతారీ గవర్నమెంట్ అండిస్తోందని అల్ జైదా చెప్పాడు. అల్ ఇస్లా సభ్యులతో ఖతార్ సంబంధాలు ఖాలిద్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ షైబాతో ప్రారంభమయ్యాయి. తీవ్రవాదంతో సంబంధాల నేపథ్యంలో ఖతార్‌పై పలు గల్ఫ్ దేశాలు ఆంక్షలు విధించాయి, ఆ దేశంతో తెగతెంపులు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఖతార్ ఈ విషయంలో వితండవాదం చేస్తూ వచ్చింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









