నివాసితులు దుమ్ము అలెర్జీలకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవాలని సలహా
- July 29, 2017
యూఏఈలో ఈ నెలలో క్రమేపీ వేడెక్కుతున్న వేసవి వడ గాలులతో కూడిన ఇసుక తుఫానులు వచ్చే అవకాశాలు ఎక్కువని పరిసర ధూళిలతో పాటుగా అలెర్జీలు తలెత్తనున్నాయని నివాసితులు తగిన ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా ఇసుక తుఫాను సమయంలో వీలయినంత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తుంన్నారు. ఇళ్లను దుమ్ము రహిత స్థాయిలో ఉంచడం మరియు అధిక సామర్థ్యం గల ఫిల్టర్లు తో పాటు గాలిని శుద్ధిచేసే పరికరాలను ఉపయోగించి లబ్ది చేకూర్చే ప్రయత్నం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇసుక తుపానులు సంభవించినపుడు ఒక సాధారణ జలుబు అలెర్జీ యొక్క లక్షణాలు ఉన్నప్పుడు ముక్కు దుమ్ముతో పూడుకుపోయి తుమ్ములు శ్వాస సంబంధిత అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా గొంతు పూడుకుపోవడం దగ్గులు రావడం మరియు చర్మ సంబంధిత దురద వంటి లక్షణాలను గమనించినట్లయితే, వారు ఆరోగ్యపరంగా అప్రమత్తత కల్గి ఉండటం అవసరమని అన్నారు. అదే స్థితి ఒక వారం దాటి కొనసాగితే, వారు ఆలస్యం చేయక వెంటనే ఒక వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.అబుదాబి లోని హెల్త్ ప్లస్ ఫ్యామిలీ సెంటర్లో సాధారణ డాక్టర్ బెచ్రా అల్జోబి, మాట్లాడుతా,ఆస్తమా వంటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల అభివృద్ధిని నివారించడానికి తగిన చికిత్స వెంటనే ప్రారంభించాలి అని అన్నారు. డాక్టర్ అలీ అక్బర్, కెనడియన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఇటీవలి జరిపిన నివేదికల ప్రకారం, యూఏఈ జనాభాలో ఐదవ వంతు మంది ప్రజలు పలు అలెర్జీలతో బాధపడుతున్నారు,ఈ సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉందని ముఖ్యంగా వేసవి నెలలలో శ్వాస సంబంధిత అలెర్జీలు అత్యధికశాతం గాలిలో ధూళి కారణంగా సంభవిస్తుంది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







