స్పోర్ట్స్ క్లబ్ వద్ద దాడి: పలువురి అరెస్ట్
- July 29, 2017
మనామా: అల్ హలా స్పోర్ట్స్ క్లబ్ వద్ద జరిగిన దాడి ఘటనకు సంబంధించి పలువురు బహ్రెయినీ యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పోర్ట్స్ క్లబ్‌లోకి ప్రవేశించిన నిందితులు, అందులోని ఆటగాళ్ళపై దాడికి దిగారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో నేషనల్ కోచ్ అబ్దుల్‌నాజర్ హసన్, అలాగే ఆయన అసిస్టెంట్ కూడా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఆటగాళ్ళతో ఓ వ్యక్తికి ఏర్పడ్డ చిన్నపాటి గొడవ, ఈ దారుణానికి కారణంగా గుర్తించారు. స్నేహితుల్ని తీసుకొచ్చి, క్లబ్‌పై ఆ యువకుడు దాడి చేయించినట్లు పోలీసులు చెప్పారు. కేసును న్యాయస్థానానికి విచారణ నిమిత్తం బదిలీ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా అరెస్టులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







