వలసదారుల గ్రీవెన్స్‌లు ఓపెన్ హౌస్‌లో పరిశీలన
- July 29, 2017
సెంట్రల్ ప్రిజన్లో ఉన్న భారతీయుల సంఖ్య 177 కాగా, డిపోర్టేషన్ సెంటర్లో 96 మంది ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఎంబసీ టీమ్, సెంట్రల్ ప్రిజన్‌ని అలాగే డిపోర్టేషన్ సెంటర్‌ని ఇటీవలే సందర్శించింది. నెలవారీ ఓపెన్ హౌస్ ద్వారా కాన్సులర్ మరియు లేబర్ ఇష్యూస్ / కేసెస్ పరిశీలన కోసం జరుగుతుందని ఎంబసీ పేర్కొంది. భారత రాయబారి పికుమరన్, థర్డ్ సెక్రెటరీ డాక్టర్ ఎం అలీమ్ ఇతర అధికారులు వివిధ కంపెనీలను సందర్శించి వలస కార్మికుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళనున్నారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరమ్ (ఐసిబిఎఫ్) జనరల్ సెక్రెటరీ మహేష్ గౌడ, ఐసిబిఎఫ్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ మాలా కృష్ణన్ తదితరులు కూడా ఈ ఓపెన్ హౌస్‌లో పాల్గొన్నారు. జనవరి నుంచి ఇప్పటిదాకా ఏడు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో 36 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిల్లో 23 ఫిర్యాదులు పరిష్కరింపబడ్డాయి. మరో 13 ఫిర్యాదులు ఫాలో అప్‌లో ఉన్నాయి. ఇండియన్ ఎంబసీ 45 ఎమర్జన్సీ సర్టిఫికెట్లను జులైలో మంజూరు చేసింది. అలాగే 29 ఎయిర్ టికెట్స్‌ని అవసరమైన భారతీయులకు అందించడం కూడా జరిగింది. ఇంకో వైపున ఐసిబిఎఫ్ 29 మంది భారత జాతీయులకు రోజువారీ అవసరాలను తీర్చడం, అలాగే ట్రాన్స్‌ఫోర్ట్ అసిస్టెన్స్ అందించడం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









