అన్న కల్యాణ్‌రామ్‌ సినిమా కి తమ్ముడు తారక్ క్లాప్

- July 30, 2017 , by Maagulf
అన్న కల్యాణ్‌రామ్‌ సినిమా కి తమ్ముడు తారక్ క్లాప్

నందమూరి కల్యాణ్‌రామ్‌ తాజా చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టుడియోలో ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌, హరికృష్ణ, క్రిష్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి షాట్‌కు ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘180’ చిత్ర దర్శకుడు జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ ప్రస్తుతం ‘ఎమ్మెల్యే’ చిత్రంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com