మాది అతిపెద్ద సైన్యం.. ఎవరినైనా ఓడించితీరుతాం
- July 30, 2017
భారత్తో సహా ప్రపంచ దేశాలకు చైనా అధ్యక్షడు క్సీ జిన్ పింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమది ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యమని, ఏ దేశాన్నైనా ఓడించి తీరుతామని ఆయన హెచ్చరించారు. సిక్కిం భూభాగంలోని డోక్లాం వద్ద గత నెల రోజులుగా భారత్ - చైనా బలగాలు మొహరించి ఉన్నాయి. ఈ సమస్య పరిష్కార దిశగా ఇరు దేశాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో.. జిన్ పింగ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
తమ దేశ సరిహద్దుల్లో చొచ్చుకువచ్చే పొరుగు దేశాల సైన్యం సహా, తమ సార్వభౌమత్వానికి ఎదురు నిలిచే శత్రువులందరినీ ఓడించే సత్తా తమకుందన్నారు. తమది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మీ అని, తమ జవాన్లకు ఎవరినైనా ఓడించగలమన్న నమ్మకం ఉందని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలకూ తావు లేదని తెలిపారు.
కాగా, భారత్, చైనా సరిహద్దుల్లోని సిక్కిం సెక్టారులోని డోక్లాం సమీపంలో ఇండియా - చైనా సైన్యాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గడచిన నెల రోజులుగా ఈ ప్రాంతంలో ఇరు వైపులా సైన్యాలు మోహరించి వుండగా, సమస్య పరిష్కారం దిశగా ఇంతవరకూ ఎటువంటి చర్చలూ మొదలు కాలేదన్న సంగతి తెలిసిందే. తమ సత్తాను పరిచయం చేస్తూ, ఇటీవల చైనా సైన్యం పలు రకాల లైవ్ డ్రిల్స్ కూడా ఈ ప్రాంతంలో చేపట్టింది. ప్రతిగా భారత సైన్యం కూడా విన్యాసాలు చేపట్టింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







