చైనాపై ఫైర్ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- July 30, 2017
కయ్యాలమారి ఉత్తరకొరియాపై చైనా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా చైనాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనా మౌనాన్ని చూస్తూ వూరుకునేది లేదన్నారు. ‘ఉ.కొరియాపై చైనా తీరు చాలా అసంతృప్తిగా ఉంది. మా దేశంలో వ్యాపారం చేసి బిలియన్ డాలర్లు సంపాదించుకునేందుకు గత అమెరికా నేతలు చైనాకు అనుమతినిచ్చారు. కానీ చైనా మాత్రం ఒట్టి మాటలు చెప్పడం తప్ప మా కోసం ఏం చేయట్లేదు. ఇక దీన్ని చూస్తూ వూరుకునేది లేదు. ఉ.కొరియా సమస్యను చైనా చాలా సులువుగా పరిష్కరించగలదు’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. తన చర్యలతో అగ్రరాజ్యం అమెరికా సహా పొరుగుదేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఉ.కొరియా శుక్రవారం మరో ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ క్షిపణితో అమెరికా మొత్తం తమ గురిలో ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ అన్నారు. కాగా.. ఉ.కొరియా ఇలాంటి ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం ఈ నెలలో ఇది రెండోసారి. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. ఉ.కొరియా చర్యలకు సరైన గుణపాఠం చెప్పాలని ట్రంప్ పదేపదే చైనాను కోరినా.. ఆ దేశం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







