స్పెయిన్‌ బార్సిలోనాలో భారీ అగ్నిప్రమాదం

- July 30, 2017 , by Maagulf
స్పెయిన్‌ బార్సిలోనాలో భారీ అగ్నిప్రమాదం

స్పెయిన్‌లోని బార్సిలోనాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ సంగీతోత్సవం సందర్భంగా బాణాసంచా పేలుస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదాన్ని గమనించిన నిర్వాహకులు వెంటనే కార్యక్రమానికి హాజరైన వారితో పాటు స్థానికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. 22వేల మందిని ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com