షూటింగ్ లో ప్రమాదం, ఐసీయూలో మంచు విష్ణు
- July 30, 2017
ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న యంగ్ హీరో మంచు విష్ణుకు ప్రమాదం జరిగింది. బైక్ రేస్ సీన్ షూట్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మలేషియాలోని పుత్రజయ ఆసుపత్రిలో విష్ణుకు చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం విష్ణు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణుతో పాటు బ్రహ్మనందం మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
హైద్రాబాద్ లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న చిత్ర బృందం ప్రస్తుతం మలేషియాలో తాజా షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎల్.కుమార్ చౌదరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మంచు విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









