హైదరాబాద్ లో జాబ్‌మేళా.. జనమేళా
- July 30, 2017
♦ రైల్వే జాబ్‌మేళాకు వివిధ ప్రాంతాల నుంచి 25 వేల మంది హాజరు
♦ ప్రారంభించిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ
రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం దక్షిణమధ్య రైల్వే, కేంద్ర కార్మిక శాఖ తొలిసారిగా నిర్వహించిన జాబ్ మేళా ‘మన కోసం’ కు అనూహ్య స్పందన వచ్చింది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ మేళాను కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. వివిధ కంపెనీల్లోని 10 వేల ఉద్యో గాల కోసం నిర్వహించిన ఈ మేళాకు 21 వేల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోగా... 25 వేల మంది హాజరయ్యారు. దీంతో ప్రాంగణం కిటకిట లాడింది. పరిసర ప్రాంతాల్లో ఐదు గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దక్షిణమధ్య రైల్వే 6వ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయ వాడ, గుంతకల్లు, నాందేడ్ సర్కిళ్ల రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ జాబ్‌మేళాలో వివిధ కంపెనీలు ఐదువేల మందికి నియామక ఉత్తర్వులిచ్చాయి. మిగిలిన ఐదువేల మందికి వారం తరువాత ఉత్తర్వులిచ్చి, శిక్షణ కార్య క్రమాలు చేపడతామన్నాయి. అయితే ఇందులో పాల్గొన్న 109 కంపెనీల్లో చాలావరకు టెలీకాలర్, సేల్స్, డెలివరీ బాయ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఉద్యోగాలే ప్రకటించడంతో ఎంతో ఆశతో వచ్చిన నిరుద్యోగులు నిరుత్సాహపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







