టర్కీ లో మహిళల వస్త్రధారణ పై ఆంక్షలు

- July 30, 2017 , by Maagulf
టర్కీ లో మహిళల వస్త్రధారణ పై ఆంక్షలు

తమకు నచ్చిన వస్త్రాలను ధరించనీయకుండా పురుషులు తమను వేధిస్తుండటంపై టర్కీ మహిళలు పెద్దయెత్తున నిరసన గళం విప్పారు. ఇస్తాంబుల్‌ నగరంలో శనివారం నాడు జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో వందలాది మంది టర్కిష్‌ మహిళలు పాల్గొన్నారు. 'వస్త్రధారణపై మమ్మల్ని వత్తిడి చెయ్యొద్ద'ంటూ వారుపెద్ద పెట్టున నినాదాలు చేశారు. పురుషుల వేధింపులకు నిరసనగా డెనిమ్‌ షార్ట్స్‌ను హాంగర్లకు తగిలించి ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. 'మీ వేధింపులను మేం భరించం, నిశ్శబ్దంగా వుండం, భయపడం, ప్రతిఘటన ద్వారా విజయం సాధిస్తాం' అంటూ మహిళలు నినాదాలతో హోరెత్తించారు. మహిళలు, గేల వస్త్రధారణకు సంబంధించి ఇస్తాంబుల్‌ నగరంలో సరళమైన విధానాలు దీర్ఘకాలంగా అమలులో వున్నాయి. అయితే అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ నేతృత్వంలోని ఇస్లామిస్ట్‌ భావజాల ఎకె పార్టీ వీరి హక్కుల పరిరక్షణపై నిరక్ష్యం చూపింది. అంతే కాక అసమ్మతిని సహించలేని స్థితికి చేరుకుంది. తమ వస్త్రధార ణకు వ్యతిరేకంగా పురుషులు దూషణలు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఈ దాడుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని నిరసన కారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో ఇంకా పలువురు గేలు, హిజ్రాలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com