బ్రిటన్లో భారతీయ మహిళ అరుదైన ఫీట్
- July 30, 2017
స్త్రీ గర్భంలో కవల పిల్లలు ఉన్నప్పుడు ఉండే ఎదుగుదల ఎలా ఉంటుంది ? ఒక శిశువు ఉన్నప్పుడు ఉండే ఎదుగుదలతో పోల్చితే, ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి ? అన్న విషయాల్ని తేల్చటం కోసం బ్రిటన్ వైద్యులు రూపొందించిన విధానం 'డిజిటల్ మానిటరింగ్'. ఈ విధానంలో ప్రపంచంలోనే తొలిసారిగా భారత సంతతి బ్రిటన్ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. మాలా వస్త్ ధురీ అనే మహిళ దక్షిణ లండన్‌లోని సెయింట్ జార్జ్ హాస్పిటల్‌లో కొద్ది రోజుల క్రితం కవల పిల్లలకి జన్మనిచ్చింది. ప్రసవానంతరం 2, 2.1 కిలోల బరువున్న ఇద్దరు నవజాత శిశువుల ఆరోగ్యం బాగుందని హాస్పిటల్ వైద్యులు తెలియజేశారు. 'డిజిటల్ మానిటరింగ్' విధానంలో గర్భస్త శిశువులపై 10వేల స్కానింగ్‌లు చేశారు. వీటిలో వచ్చిన రీడింగ్స్‌తో అనేక ఛార్ట్స్ రూపొందించారు. గర్భంలో కవల పిల్లల సహజసిద్ధమైన ఎదుగుదల (ఒక శిశువుతో పోల్చుతూ )ను ఈ ఛార్ట్స్ తెలియజేస్తాయి. వారిలోని లోపాల్ని, ఇతర సమస్యల్ని, ఎదుగుదలని, ప్రసవ సమయాన్ని అంచనావేయవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







