టర్కీ లో మహిళల వస్త్రధారణ పై ఆంక్షలు
- July 30, 2017
తమకు నచ్చిన వస్త్రాలను ధరించనీయకుండా పురుషులు తమను వేధిస్తుండటంపై టర్కీ మహిళలు పెద్దయెత్తున నిరసన గళం విప్పారు. ఇస్తాంబుల్ నగరంలో శనివారం నాడు జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో వందలాది మంది టర్కిష్ మహిళలు పాల్గొన్నారు. 'వస్త్రధారణపై మమ్మల్ని వత్తిడి చెయ్యొద్ద'ంటూ వారుపెద్ద పెట్టున నినాదాలు చేశారు. పురుషుల వేధింపులకు నిరసనగా డెనిమ్ షార్ట్స్‌ను హాంగర్లకు తగిలించి ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. 'మీ వేధింపులను మేం భరించం, నిశ్శబ్దంగా వుండం, భయపడం, ప్రతిఘటన ద్వారా విజయం సాధిస్తాం' అంటూ మహిళలు నినాదాలతో హోరెత్తించారు. మహిళలు, గేల వస్త్రధారణకు సంబంధించి ఇస్తాంబుల్ నగరంలో సరళమైన విధానాలు దీర్ఘకాలంగా అమలులో వున్నాయి. అయితే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నేతృత్వంలోని ఇస్లామిస్ట్ భావజాల ఎకె పార్టీ వీరి హక్కుల పరిరక్షణపై నిరక్ష్యం చూపింది. అంతే కాక అసమ్మతిని సహించలేని స్థితికి చేరుకుంది. తమ వస్త్రధార ణకు వ్యతిరేకంగా పురుషులు దూషణలు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఈ దాడుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని నిరసన కారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో ఇంకా పలువురు గేలు, హిజ్రాలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







