ఫిలిగ్రిమ్స్‌ కోసం పాస్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సేవలు

- July 30, 2017 , by Maagulf
ఫిలిగ్రిమ్స్‌ కోసం పాస్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సేవలు

ఫిలిగ్రిమ్స్‌ కోసం పాస్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, జెడ్డా ఎయిర్‌పోర్ట్‌ వద్ద క్వాలిఫైడ్‌ హ్యూమన్‌ క్యాడర్స్‌ని ఏర్పాటు చేసింది. ఈ సిబ్బంది ద్వారా ఫిలిగ్రిమ్స్‌కి అవసరమైన సేవల్ని అందిస్తారు. ఎయిర్‌పోర్ట్‌ వద్దనే ఫిలిగ్రిమ్స్‌కి కావాల్సిన వివరాలు అందించడం, వారికి సహాయపడటం ఈ సిబ్బంది బాధ్యత. జెడ్డాలోని కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద పాస్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అందిస్తోన్న సేవల్ని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌ డైరెక్టర్‌ మేజర్‌ జనరల్‌ సులైమాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ యహ్యా తనిఖీలు నిర్వహించారు. అల్‌ యహ్యా వెంట డిప్యూటీ కమాండర్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌ అథారిటీ - హజ్‌ ఎఫైర్స్‌ మేజర్‌ ఖాలిద్‌ ఫహాద్‌ అల్‌ జైద్‌ సహా పలువురు అధికారులు ఉన్నారు. ఫిలిగ్రిమ్స్‌కి సేవలు అందించే విషయంలో సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేలా చూడాలని అల్‌ యహ్యా అధికారులకు సూచించారు. ఇంకో వైపున మక్కా రీజియన్‌ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ అబ్దుల్లా బిన్‌ బందర్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌, ఆదివారం జెడ్డా ఎయిర్‌పోర్ట్‌లోని హజ్‌ టెర్మినల్‌ కాంప్లెక్స్‌ని పరిశీలించారు. పాదచారుల వంతెనలు, టాయిలెట్లు, ట్రైన్‌ గేట్లు సహా పలు విషయాల్లో ఫిలిగ్రిమ్స్‌కి తగిన సేవలు అందాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. హజ్‌ సీజన్‌ సందర్భంగా మలేసియన్‌ కంపెనీ తాము నిర్వహిస్తున్న మషీర్‌ రైల్వే నెట్‌వర్క్‌ కోసం తాత్కాలికంగా యువ సౌదీలకు ఉద్యోగాలను అందిస్తోంది. ఈ సీజన్‌లో 8 రోజులపాటు ఔత్సాహికులు పనిచేయాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com