ట్రంప్‌కు షాకిచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్
- July 30, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ గట్టి షాకిచ్చారు. అమెరికా.. రష్యాలోని తమ దౌత్యాధికారులను తగ్గించుకోవాలని పుతిన్ సూచించారు. ఈ మేరకు 755 మంది యూఎస్ దౌత్యాధికారులను దేశం నుంచి పంపించేందుకు తాము నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కావాలని రష్యా విదేశాంగ శాఖ అమెరికాను ఆదేశించింది. అసలేం జరిగిందంటే..
రష్యాకు వ్యతిరేకంగా ఇటీవల అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు పాస్ అయింది. త్వరలోనే ఆ బిల్లుకు ట్రంప్ ఆమోదముద్ర వేసి చట్టం చేయనున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన రష్యా.. అమెరికా తమ ఉద్యోగులను తగ్గించుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం రష్యాలోని అమెరికా ఎంబసీల్లో 1000 మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరిలో అమెరికన్లతో పాటు రష్యన్లు కూడా ఉన్నారు. అయితే ఈ సంఖ్యను 455కు తగ్గించుకోవాలని రష్యా ఆదేశించింది. మిగిలిన వారిని సెప్టెంబర్ 1 నుంచి తొలగించాలని పేర్కొంది.
దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్థానిక మీడియాతో మాట్లాడారు. ‘రష్యా, అమెరికా మధ్య సత్సంబంధాలు పెరుగుతాయని భావించాం. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. అమెరికాకు దీటుగా సమాధానం చెప్పాల్సిన సమయం ఇదే అని మేం అనుకున్నాం’ అని పుతిన్ అన్నారు.కాగా.. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఇది అవాంఛనీయమైన ఘటన అని పేర్కొంది. రష్యా నిర్ణయంపై ఇప్పుడే ఎలాంటి ప్రకటనలు చేయలేమని తెలిపింది. అయితే రష్యాలోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో ఎంతమంది పనిచేస్తున్నారో చెప్పేందుకు విదేశాంగ శాఖ నిరాకరించింది.
కాగా.. రష్యా, అమెరికా మధ్య ఇలా దౌత్యవేత్తలను తగ్గించడం ఇది తొలిసారేం కాదు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో రష్యా జోక్యం చేసుకోవడంతో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలో అమెరికాలో పనిచేస్తున్న 35 మంది రష్యన్ దౌత్యవేత్తలను దేశం నుంచి పంపిస్తూ ఆదేశాలు జారీచేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









