స్మగ్లింగ్‌ యత్నం భగ్నం

- July 31, 2017 , by Maagulf
స్మగ్లింగ్‌ యత్నం భగ్నం

జెడ్డా: జజాన్‌, నజ్రామ్‌లలో బోర్డర్‌ గార్డ్స్‌ 477.55 కిలోల హాషిస్‌, 855 యాంఫిటమిన్‌ పిల్స్‌ స్మగ్లింగ్‌ని అడ్డుకున్నారు. బోర్డర్‌ గార్డ్స్‌ అధికార ప్రతినిథి కల్నల్‌ సహెర్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ హర్బి ఈ వివరాల్ని వెల్లడించారు. గడచిన రెండు వారాల్లో పలు స్మగ్లింగ్‌ అటెంప్ట్స్‌ని బోర్డర్‌ గార్డ్స్‌ అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 10 మంది ఇథియోపియన్లు, 19 మంది యెమనీయులు, ఒక సౌదీ జాతీయుడ్ని బోర్డర్‌ గార్డ్స్‌ అదుపులోకి తీసుకున్నారు. ఇంకో వైపున 10,000 కాప్టగాన్‌ పిల్స్‌ రియాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్నారు. కింగ్‌ ఖాలిద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ 10,832 కాప్టగాన్‌ పిల్స్‌ని రెండు వేర్వేరు ఘటనల్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com