మామ మంచు అల్లుడు కంచు
- October 21, 2015
ఇటీవల వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. రొటీన్ కామెడీ సినిమాలతో పాటు, ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన సినిమాలు కూడా పెద్దగా వర్కవుట్ కాకపోవటంతో కాస్త గ్యాప్ తీసుకున్న నరేష్, ఓ డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. సీనియర్ హీరో మోహన్ బాబుతో కలిసి 'మామ మంచు అల్లుడు కంచు' సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ స్పెషలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మరో యంగ్ హీరో విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు నిర్మాత మంచు విష్ణు. దాదాపుగా షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి డిసెంబర్ నెలాఖర్లో క్రిస్ మస్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మోహన్ బాబు కాంబినేషన్ లో వస్తున్న 'మామ మంచు అల్లుడు కంచు' సినిమాతో అయినా అల్లరి నరేష్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్‌లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్‌లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్‌లో వాకింగ్, సైక్లింగ్‌కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్‌కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







