ప్రభాస్ తో మరో సినిమా చేయనున్న రాజమౌళి
- July 31, 2017
మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టేందుకు ఆ ఇద్దరూ సిద్ధమవుతున్నారట. హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన ఆ క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకి కథ కూడా ఫైనల్ అయ్యిందట.
రాజమౌళి-ప్రభాస్ వీరిద్దరిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన 'ఛత్రపతి', 'బాహుబలి ద బిగినింగ్', 'బాహుబలి ద కంక్లూజన్' చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. అలాంటి వీరి కలయికలో ఇప్పుడు మరోసారి సినిమా రాబోతోందట.
'బాహుబలి' సమయంలోనే ప్రభాస్‌కు ఓ కథను వినిపించాడట జక్కన్న. ఆ స్టోరీ బాగా నచ్చేయడంతో సినిమా చేస్తానన్నాడట యంగ్ రెబెల్ స్టార్. అయితే ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత 'జిల్' రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. మరోవైపు రాజమౌళి కూడా డి.వి.వి. దానయ్య, కె.ఎల్.నారాయణతో సినిమాలు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. వారితో చేసే సినిమాకోసమే ఇప్పుడు కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు ఈ స్టార్ డైరెక్టర్.
మొత్తంమీద ప్రయర్ కమిట్ మెంట్స్‌ను పూర్తి చేసే పనిలో ఉన్న రాజమౌళి-ప్రభాస్.. కుదిరితే వచ్చే యేడాది తమ కలయికలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారట. మరి ప్రేక్షకులకు మరోసారి 'బాహుబలి' కాంబినేషన్‌ను తెరపై చూసే అవకాశం ఎంత తొందరగా దొరుకుతుందో చూడాలి.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







