ఇబ్బందిగా మారిన పాక్ సరిహద్దులోని అతిపెద్ద జెండా
- July 31, 2017
శాశ్వత శత్రువు పాకిస్థాన్‌కు కనిపించేలా ఏర్పాటు చేసిన అతిపెద్ద త్రివర్ణ పతాకం మూడు నెలలుగా కనిపించడం లేదు. భారత్-పాక్ సరిహద్దులోని అట్టారిలో 360 అడుగుల పొడవైన భారీ జెండాను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంత ఎత్తులో ఉండటం.. గాలి వేగంగా వీస్తుండటంతో పతాకం ప్రతిసారీ చిరగడం.. అమృత్సర్ పరిపాలన విభాగం తొలగించడం జరిగిపోతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చిరిగిన పతాకాన్ని తొలగించిన తర్వాత మళ్లీ కొత్త జెండా ఎగరేయలేదు. మువ్వన్నెల పతాకం చిరిగి ఇబ్బంది పెడుతోందని అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ కమల్‌దీప్ సింగ్ సంఘా రాష్ట్ర హోం మంత్రిత్వశాఖకు లేఖ కూడా రాశారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలీక హోం శాఖ మల్లగుల్లాలు పడుతోంది.
పెరిగిన ఖర్చు:
సరిహద్దుల్లో జెండాతో పాటు అమృత్సర్ నగరంలోని 170 అడుగుల జెండాను అధికారులు తొలగించారు. అట్టారి జెండా మూడు సార్లు చిరిగిపోగా ఈ జెండా 13 సార్లు చిరిగింది. 15 రోజుల్లో స్వాతంత్య్ర దినోత్సవం వస్తుండటంతో అప్పటిలోగా పతాకాలను పునరుద్ధరిస్తారో లేదో తెలియడం లేదు. ఈ అంశంపై అమృత్సర్ ఎంపీ గుర్జీత్ సింగ్ ప్రభుత్వంతో, మంత్రి నవ్‌జోత్ సింగ్ సిద్ధూతో మాట్లాడతానని చెప్పారు. జెండాల బాధ్యత ఉన్న అమృత్సర్ అభివృద్ధి సంస్థకు ఈ రెండు పతకాల నిర్వహణ భారంగా మారింది. ఇప్పటి వరకు సరిహద్దు జెండాకు రూ.3 లక్షలు, నగరంలోని జెండాకు రూ.6 లక్షలు ఖర్చుచేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







