జైలు తప్పించుకునేందుకు 72,000 బహ్రెయినీ దినార్స్‌ చెల్లించిన మాజీ మంత్రి

- August 01, 2017 , by Maagulf
జైలు తప్పించుకునేందుకు 72,000 బహ్రెయినీ దినార్స్‌ చెల్లించిన మాజీ మంత్రి

మనామా: మాజీ మంత్రి, 72,000 బహ్రెయినీ దినార్స్‌ చెల్లించేందుకు సమ్మతించారు. జైలు శిక్ష తప్పించుకునేందుకు ఈ మొత్తం చెల్లించడానికి ఆయన ముందుకొచ్చారు. కుమారుడి మరణం తర్వాత, ఆ కుమారుడి భార్య అలాగే ఆమె కుమార్తెని అక్కున చేర్చుకునేందుకు నిరాకరించడంతో అతనికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. నిందితుడు తన కుమారుడు మరణించడానికి కొద్ది గంటల ముందే కోడల్ని ఇంట్లోంచి బయటకు గెంటివేయగా, ఆమెకు ఓ అమ్మాయి జన్మించింది. ఈ కారణంగా బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మృతుడికి సంబంధించిన వస్తువుల్ని పబ్లిక్‌ ఆక్షన్‌లో పెట్టి, తద్వారా వచ్చిన సొమ్ముని బాధితురాలికి అప్పగించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఆక్షన్‌లో మొత్తం 145,000 బహ్రెయినీ దినార్స్‌ రాగా ఆ మొత్తాన్ని బాధితురాలికి ఇచ్చేందుకు నిరాకరించాడు నిందితుడు. న్యాయస్థానం జోక్యంతో నిందితుడు మిగతా మొత్తం చెల్లించడానికి అంగీకరించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com