మొత్తం భారత్ లో కళ్ళ అత్యంత ఖరీదైన మూవీ టికెట్స్: మన 'బాహుబలి 2'
- August 01, 2017
ఇండియాలో అత్యంత ఖరీదైన సినిమా థియేటర్ ఏదైనా ఉంది అంటే... అది ఢిల్లీలోని 'పివిఆర్ డైరెక్టర్స్ కట్' అనే థియేటర్. ఇందులో సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సిందే. సినిమాకు ఉన్న డిమాండును బట్టి ఈ థియేటర్లో టికెట్స్ రేటు మారుతూ ఉంటుంది.
ఇప్పటి వరకు ఈ థియేటర్లో అత్యంత ఎక్కువ ధరకు టికెట్స్ అమ్మకానికి పెట్టిన సినిమాల్లో 'బాహుబలి 2' మూవీ టాప్ పొజిషన్లో ఉంది. బాహుబలి 2 విడుదలైన సమయంలో డిమాండ్ భారీగా ఉండటంతో ఒక్కో టికెట్ రూ. 2400 ధరకు అమ్మారు. ఇండియాలో అఫీషియల్‌గా అత్యంత ఎక్కువ టికెట్ రేటు నమోదైన సినిమా ఇదే.
త్వరలోనే విడుదల కాబోతున్న షారుక్ ఖాన్ మూవీ 'జబ్ హ్యారీ మెట్ సెజల్' మూవీకి డిమాండ్ అదే స్థాయి ఉంది. ఇప్పటికే ఈ థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి. ఒక్కో టికెట్ ధర రూ. 2400గా ఉంది.
ప్రభాస్ 'బాహుబలి 2', షారుక్ 'జబ్ హ్యారీ మెట్ సెజల్' తర్వాత ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ మూవీ 'యే దిల్ హై ముష్కిల్' మూవీ అత్యంత ఎక్కువ ధర పలికిన సినిమాగా సెకండ్ ప్లేసులో ఉంది. ఈ సినిమా టికెట్ 'పివిఆర్ డైరెక్ట్స్ కట్' థియేటర్లో రూ. 2200లకు అమ్మడయింది.
సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్' మూవీ పివిఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్లో ఒక్కో టిక్కెట్ రూ. 1800లకు అమ్ముడు పోయింది.
షారుక్ ఖాన్ నటించిన 'రయీస్' మూవీ పివిఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్లో ఒక్కో టికెట్ రూ. 1500లకు అమ్ముడయింది.
ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన సల్మాన్ ఖాన్ మూవీ 'ట్యూబ్ లైట్' టికెట్ రూ. 1500లకు అమ్ముడయింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







