భారతదేశంతో సహా మరో నాలుగు దేశాలలో యూఏఈ మసీదుల నిర్మాణం
- August 04, 2017
యూఏఈ నేషనల్ ఆర్కైవ్స్ ఐదు మసీదులు నిర్మించడానికి మరియు యూఏఈ వెలుపల రెండు బావులను తవ్వించేందుకు సన్నాహాలు చేస్తుంది. అబూదాబి ఎమిరేట్స్ శాఖ రెడ్ క్రెసెంట్ సహకారంతో ఈ దాతృత్వ కార్యాక్రమంను ప్రారంభించింది. మౌరిటానియ, సోమాలియా, బుర్కినా ఫాసో, మాలి ,భారతదేశం లో నిర్మించబడుతున్న ఈ అయిదు మసీదులలో ఒక్కో దానిలో కనీసం 800 మంది వ్యక్తుల ఒక్కసారే నమాజు చేసుకొనే సౌకర్యంతో వీటిని నిర్మిస్తున్నారు. మసీదు భవనం ప్రాజెక్ట్ క్రింద " జాతీయ ప్రాచీన బాండాగారా మసీదులుగా " గా పిలవబడనున్నాయి. అదేవిధంగా రెండు బావులను భారతదేశం మరియు మాలిలో నిర్మించబడతాయి. నేషనల్ ఆర్కైవ్స్ ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ కు తమ సహకారంతో పాటు వారి ఉద్యోగులు ఉదారంగా అందచేయబడిన విరాళాలకు ధన్యవాదాలు తెలియజేసింది. మానవ ఔత్సాహిక మరియు స్వచ్ఛంద, సామాజిక బాధ్యతలో భాగమైన వారి దాతృత్వంతో ఇవ్వడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. నేషనల్ ఆర్కైవ్స్ ఈ రకమైన స్వచ్ఛంద మానవతావాద కార్యకలాపాలను కొనసాగించడంతో యూఏఈ ఆదర్శ చిత్రంను సూచించే ఉత్తమ మార్గంగా పరిగణించింది.
తాజా వార్తలు
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్







