షర్క్ లో మసీదుపై దాడి చేసిన నివేదికలు నిరాధారమైనవి, మోయి స్పష్టం
- August 05, 2017
కువైట్ : షర్క్ జిల్లాలోని ఒక మసీదుపై ఒక ప్రత్యేక దళాల దాడి గురించి మరియు కువైట్ నగరంలో ఒక వ్యక్తిని నిర్బంధించడం గురించి సోషల్ మీడియాలో ప్రచురించిన ఒక పోస్ట్ "పూర్తిగా అబద్ధము" అని ఆ నివేదికలలో వాస్తవం లేదని ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. మంత్రిత్వ శాఖ యొక్క పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ శుక్రవారం ఈ మేరకు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. మసీదులో ఆరాధకుల భద్రతకు హామీ ఇచ్చే చర్యలలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యలను పరిశీలించడానికి అక్కడ ఉన్న అధికారితో సమన్వయం పొందిన తరువాత ఒక భద్రతా బృందం మసీదును సందర్శించిందని వివరించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సౌకర్యాలు, ఆరాధనా స్థలాల భద్రతను కొనసాగించడానికి ముందు జాగ్రత్త చర్యలు, భద్రతా సందర్శనలు రెండూ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహమూద్ అల్-దోషరి ఇదే విధమైన తరచూ తనిఖీ సందర్శనలను జరిపినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ కల్పిత వార్తలు మరియు పుకార్లను ప్రజలు విశ్వసించరాదని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విషయంపై ఏ ప్రశ్నలకైనా పారదర్శక పద్ధతిలో స్పందించదానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









