వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్
- August 05, 2017
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇటీవల వాట్సాప్‌నకు సంబంధించిన అనేక కొత్త ఫీచర్ల సంగతులు బయటికొచ్చాయి. వీడియో కాల్లో ఇమేజ్ ఇన్ మోడ్, స్టిక్కర్లు పంపుకునే సౌలభ్యం, టెక్ట్స్ కొత్త ఎఫెక్ట్స్ జోడించేలా ఫీచర్ల వంటివి కొన్ని పరిశీలన దశలో ఉండగా మరికొన్ని త్వరలో అందుబాటులోకి రానున్నాయి. తాజాగా ఫేస్బుక్ తరహాలో వాట్సాప్‌లోనూ రంగురంగుల బ్యాగ్రౌండ్‌తో స్టేటస్ పెట్టుకోవచ్చు. ఇందులో ఫేస్బుక్ తరహాలో ఫాంట్ ఎమోజీలను ఉపయోగిండం, బ్యాగ్రౌండ్ మార్చుకోవడం వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పరిశీలన దశలో ఉంది.
ఆండ్రాయిడ్ బేటా వెర్షన్ 2.17.291లో ఈ కొత్త ఫీచర్‌ను జోడించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఇది కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని సమాచారం. స్టేటస్‌లో ఎదైనా టెక్ట్స్ రాశాక నచ్చిన కలర్ బ్యాగ్రౌండ్ పెట్టడం, ఫాంట్ స్టైల్ మార్చడం, ఎమోజీలను జోడించడం వంటివి ఈ ఫీచర్ ద్వారా చేయొచ్చు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









