'జై లవ కుశ' టీజర్
- August 05, 2017
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవ కుశ' నుండి మరో టీజర్ రాబోతోంది. మరోవైపు విడుదలకు ముస్తాబవుతోన్న ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతోందట!
'జై లవ కుశ'లో మొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తూ తారక్ అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాల్ని పెంచేశాడు. ఇక ఈ చిత్రంలోని 'జై' పాత్రకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలయ్యింది. ప్రతినాయక ఛాయలతో ఉన్న 'జై' పాత్రలో ఎన్టీఆర్ పెర్ఫామెన్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు ఈ చిత్రంలోని మరో క్యారెక్టర్ 'లవ' టీజర్‌ను రాఖీ కానుకగా ఈ నెల 7న విడుదల చేయనున్నారట.
దసరా కానుకగా సెప్టెంబర్ 21న విడుదల కాబోతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్‌ను హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ 10.5 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తోన్న ఈ చిత్రం ఆడియో త్వరలోనే విడుదలకాబోతోంది.
ఒకవైపు 'జై లవ కుశ' సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరోవైపు 'బిగ్ బాస్' షోతో బుల్లితెరపై తన సత్తా చాటుతున్నాడు. ఇక ఈ రియాలిటీ షోకి ఇప్పుడు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. తాజాగా.. ఎన్టీఆర్ కనిపించే వీకెండ్ ఎపిసోడ్స్‌కు.. రికార్డ్ లెవెల్లో 12.3 టి.ఆర్.పి వచ్చిందట. పార్టిసిపెంట్స్‌కు కొత్త కొత్త టాస్క్ లు ఇస్తూ సరికొత్త ట్విస్ట్‌లతో.. మంచి క్రేజ్ సంపాదించుకుంటోన్న 'బిగ్ బాస్' షో సూపర్ హిట్ అంటున్నారు నిర్వాహకులు. మొత్తంమీద బుల్లితెరపై కూడా యంగ్ టైగర్ తన మార్కు చూపించాడన్నమాట.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









