విజయదశమి విశిష్టత
- October 21, 2015
విజయదశమి నాడు ఎర్రటి పట్టు వస్త్రాలు ధరించడం ద్వారా కోరుకున్న కోరికలు దిగ్విజయమౌతాయి. శరన్నవరాత్రుల్లో చివరి రోజైన విజయదశమి నాడు సూర్యోదయమునకు ముందే నిద్ర లేవాలి. ఉదయం ఐదింటికి నిద్రలేచి.. తలస్నానము చేసి పూజామందిరము, ఇల్లు శుభ్రం చేయాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరమును రంగవల్లికలతో అలంకరించుకోవాలి.
ఎర్రటి పట్టు వస్త్రాలను ధరించి పూజకు రాజరాజేశ్వరి ఫోటో గానీ దుర్గాదేవి ప్రతిమను ఫోటోను సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి కనకాంబరములు, నల్ల కలువపూవులు, నైవేద్యానికి పొంగలి, పులిహోర, అరటి పండ్లు సిద్ధం చేసుకోవాలి.
సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విజయదశమి పూజ చేయవచ్చు. ఈ పర్వదినము శుక్రవారం పూట వస్తే చాలామంచిది. పూజకు ముందు రాజరాజేశ్వరి అష్టకం, రాజరాజేశ్వరి సహస్ర నామాలు, దేవి భాగవతమును పారాయణము చేయాలి.
ఇంకా విజయదశమి రోజున దుర్గాదేవి, శ్రీశైలం ఆలయాలను దర్శించుకోవడం శుభఫలితాలనిస్తుంది. ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలితాసహస్రనామము, నవరాత్రి వ్రతము, శ్రీదేవి లీలామృతం, రాజరాజేశ్వరి నిత్యపూజ, నవరాత్రి ఉత్సవములు, కోటి కుంకుమార్చన వంటి పూజలు.. పంచామృతముతో అభిషేకము నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి.
దీపారాధనకు మూడు ప్రమిదెలు, 9 వత్తులు తీసుకోవాలి. హారతికి ఆవునేతిని, దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి. నుదుట కుంకుమను ధరించి, శ్రీ మాత్రేనమః అనే మంత్రాన్ని 108 మార్లు జపించి అనంతరం దీపారాధన చేయాలి. పూజచేసేటప్పుడు తామరమాల ధరించి, ఆగ్నేయము వైపు కూర్చోవాలని పండితులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







