రామోజీ ఫిలిం సిటీ లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు

- August 06, 2017 , by Maagulf
రామోజీ ఫిలిం సిటీ లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు

ఈనెల 11 నుంచి 15 వరకు 'ఫ్రీడం ఫెస్ట్‌'ఐదురోజుల పాటు వినోదాల కనువిందు హైదరాబాద్‌: పర్యాటకుల స్వర్గథామం.. వినోదాల కేంద్రం రామోజీ ఫిల్మ్‌సిటీ స్వేచ్ఛా సంబరాలకు ముస్తాబైంది. 'ఫ్రీడం ఫెస్ట్‌' పేరుతో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తోంది. వారాంతంలో సరదాగా గడపడమే కాదు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటే కార్యక్రమాల్లో సందర్శకులు పాలుపంచుకునేలా పలు ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి. నాసిక్‌ నుంచి దూల్‌ బీట్స్‌, థిమాటిక్‌ పాటలు, బాహుబలి ఫేం గాయనీగాయకుల పాటలతో.. ఢీ జోడీ నృత్యాలు.. మైమరిపించే ప్రదర్శనలతో వేడుకలు ఆసాంతం అతిథులను ఆనందంలో ముంచెత్తనున్నాయి.ఫ్రీడం ఫెస్ట్‌ రామోజీ స్టార్‌ ఎక్స్‌పీరియన్స్‌ (ఉ. 9గంటల నుంచి రాత్రి 7.30 వరకు).. ఏసీ కోచ్‌లో సందర్శన ఉంటుంది. ప్రదర్శన, వినోద కార్యక్రమాల్లో నేరుగా ప్రవేశం ఉంటుంది. ఎక్కువ సేపు ఎదురుచూడాల్సిన పనిలేదు.

స్వేచ్ఛా సంబరాలతో పాటూ బఫె లంచ్‌ ఉంటుంది. ఒళ్లు గగుర్పొడిచే రైడ్స్‌, స్టంట్‌ షోలతో పాటూ ప్రకృతి ఒడిలో గడిపిన అనుభూతినిచ్చే ఎకో టూర్‌ వంటి విశేషాలు ఎన్నో చూడొచ్చు. అక్కడే ఉండాలనుకునే వారికి.. రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శన అనంతరం రాత్రి అక్కడే బస చేయాలనుకునే పర్యాటకులకు వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

లగ్జరీ హోటల్‌ సితార, కంఫర్ట్‌ హోటల్‌ తార.. ఎకానమిలో శాంతినికేతన్‌లో బస చేయవచ్చు. సుందర పరిసరాలను ఆస్వాదిస్తూ.. మరుపురాని అనుభూతులను సొంతం చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com