తెలంగాణ క్లస్టర్ కు కేంద్రం ఆమోదం
- August 06, 2017
తెలంగాణలో రూ.437 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయ తలపెట్టిన ఎలక్ట్రానిక్స్ మానుఫాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)కు కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) సమర్పించిన ప్రతిపాదనలకు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ఆమోదం తెలిపిందని అధికార వర్గాలు తెలిపాయి. 310 ఎకరాల్లో ఈ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణకు ఇది రెండో క్లస్టర్ కావడం గమనార్హం. అంతకుముందు 600 ఎకరాల్లో రూ.667 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయ తలపెట్టిన క్లస్టర్‌కు టీఎస్‌ఐఐసీ ప్రతిపాదనలు పంపగా సంబంధిత మంత్రిత్వ శాఖ జులైలో ఆమోదం తెలిపింది. ఈఎంసీ స్కీమ్ కింద ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం కేంద్రం సాయంగా అందిస్తుంది. మొత్తంగా దేశంలో ఇప్పటి వరకు 15 ఈఎంసీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







