ఉత్తర కొరియా కు కళ్లెం వేస్తున్న అమెరికా
- August 06, 2017
అణ్వస్త్ర ప్రయోగాలతో అగ్రరాజ్యాన్ని కలవరపెడుతున్న ఉత్తర కొరియా దూకుడుకు కళ్లెం వేసే దిశగా అమెరికా కీలక విజయం సాధించింది. ఆ దేశ ఎగుమతులపై ఆంక్షలు విధించాలంటూ అమెరికా ప్రవేశ పెట్టిన ముసాయిదా తీర్మానాన్ని సమర్థిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎగుమతుల ద్వారా అర్జిస్తున్న ధనంలో రూ.100 కోట్ల డాలర్ల విదేశీ ద్రవ్యాన్ని ఉత్తర కొరియా నష్టపోవాల్సి వస్తోంది. అమెరికాను నాశనం చేయగల అణువార్ హెడ్లు తమ వద్ద ఉన్నాయంటూ కొంతకాలంగా అణు ప్రయోగాలు చేస్తూ ఉత్తరకొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రష్యా, చైనాలు ఉత్తరకొరియాకు ప్రధాన ఆర్థిక భాగస్వాములుగా ఉన్నాయంటూ ఆరోపిస్తున్న అమెరికా.. ఈ దేశాలతో వాణిజ్య సంబంధాలతో అర్జిస్తున్న ధనాన్ని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్జంగ్ హుంగ్ అణుప్రయోగాలపై ఖర్చు చేస్తున్నారని ఆక్షేపిస్తుంది. ఎగుమతులపై నిషేధం విధించడం ద్వారా అణ్వస్త్ర ప్రయోగాల్లో ఉత్తరకొరియా దూకుడు స్వభావాన్ని నియంత్రించాలంటూ అమెరికా ఐరాస భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానం ఆమోదం పొందడం వల్ల ఉత్తరకొరియా ప్రధాన ఎగుమతులైన బొగ్గు, ఇనుపఖనిజం, సముద్ర ఉత్పత్తులు నిలిచిపోనున్నాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!







