సరికొత్త ప్రేమకథకు శ్రీకారం చుట్టనున్న ఇంద్రగంటి
- August 06, 2017
'జెంటిల్మన్', 'అమీ తుమీ' హిట్ల తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తన తర్వాత చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట. ఈసారి స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇంద్రగంటి తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు.
'ప్రేమకథ తెరకెక్కించాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. కానీ కుదరలేదు. ఈసారి నా తర్వాత సినిమాతో అది జరిగేలా ఉంది. స్వచ్ఛమైన ప్రేమకథగా ఆ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన కథ దాదాపు సిద్ధం చేశా, నటీనటులను ఎంపిక చేయాలి' అని ఇంద్రగంటి అన్నారు. అనంతరం నటీనటులుగా ఎవరిని అనుకుంటున్నారని ప్రశ్నించగా.. 'ఇంకా ఏదీ నిర్ధారణ కాలేదు. అప్పుడే నటీనటుల గురించి మాట్లాడటం సరికాదు' అని చెప్పారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







