లాటరీలో 5 మిలియన్ ధిర్హాంలను ( 8 కోట్ల రూపాయలు) గెల్చుకున్న భారాతీయుడు
- August 07, 2017
' దురదృష్టవంతుడికి ...అడవిలోనూ ఆకులు కరువైతే , అదృష్టవంతుడికి ఎడారిలో ఉన్నప్పటికీ సిరిసంపదలు ఎదురు పరుగెత్తుకువస్తాయి '. అచ్చం అదే తీరులో అబూధాబిలో తాజాగా ముగిసిన లాటరీ డ్రాగా భారతీయ ప్రవాస భారతీయుడు ఓ పెద్ద జాక్ పాట్ కొట్టిపారేశాడు. నిన్నటిదాకా సాదాసీదా ఉద్యోగిగా నానా అగచాట్లు పడుతున్న అతడికి ఒక్కసారిగా రూ.8.27 కోట్లకు అధిపతిగా మారిపోయాడు. దుబాయ్‌లోని రస్ అల్‌ఖైమాలో ఓ నిర్మాణరంగ సంస్థలో గత 9 ఏళ్ల నుంచి సామాన్య ఉద్యోగిగా ఉన్న కృష్ణంరాజు తోకచిచు ఒక్కసారిగా శ్రీమంతుడయ్యాడు. అదృష్టం. తాజాగా అబుదాబీలో వెలువడిన ‘బిగ్ఫై టికెట్ డ్రా’లో అతడిని వరించిందీ కోట్ల డబ్బు!!. ఎప్పుడూ స్నేహితులతో కలిసి లాటరీ టికెట్ కొనేవాడినని, ఈసారి లక్కీగా ధరనంతా తానే భరించి టికెట్ కొన్నానని కృష్ణంరాజు మురిసిపోతున్నాడు. మూడేళ్లుగా తాను లాటరీ టికెట్లు కొంటున్నానని, ఇందుకు ప్రతినెలా సంపాదనలో కొంత డబ్బును పక్కన పెట్టేవాడినని కృష్ణంరాజు చెప్పాడు. లాటరీ సంస్థ నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చినప్పుడు నేను అస్సలు నమ్మలేదు. వాళ్లు ఫోన్ పెట్టేశాక.. ఆ సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేశా. అప్పటికి వాళ్లు దాన్ని అప్డేట్ చేయలేదు. ఒక అరగంట తర్వాత మళ్లీ చూశా.. అప్పుడే నా పేరుతో వాళ్లు ఓ ట్వీట్ చేశారు. దాన్ని చూశాక నాకు ఆనందంతో గుండె ఆగినంత పనయింది. నేను విన్నర్‌గా సెలెక్ట్ అయ్యానని వెబ్సైట్లో చూశాకే మా వాళ్లకు విషయాన్ని చెప్పా. ఈ అరగంట వరకూ నేను టెన్షన్‌తో గడిపా. ఈ డబ్బుతో ఏం చేయాలా అని ఇప్పటికీ మా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నా. ముందుగా మా కుటుంబంపై ఉన్న మొత్తం అప్పుల్ని తీర్చేస్తా. ఆ తర్వాత నా నాలుగేళ్ల కొడుకు కోసం కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా. మిగిలిన డబ్బుతో ఏం చేయాలో ప్లాన్ చేస్తున్నా’ అని కృష్ణంరాజు పట్టరాని ఆనందంతో ఏమేమి చేయాలో గుక్కతిప్పుకోకుండా చెబుతున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







