తమిళ హీరో విశాల్‌కు గాయాలు
- August 07, 2017
టుడు విశాల్‌కు సినిమా షూటింగ్‌లో గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం తుప్పరివాలన్. విశాల్ ఫిలిం ప్యాక్టరీ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ గత కొద్ది రోజులుగా తమిళనాడులోని చిదంబరం సమీపంలోని పిచ్చాపరంలో జరుగుతోంది. అక్కడ విశాల్ శత్రువులతో పోరాడే దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.
కాగా సోమవారం పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తుండగా బ్యాలెన్స్ తప్పి విశాల్ కిందపడిపోయి గాయపడ్డారు. వెంటనే సమీపంలోని వైద్యులకు పిలిపించి చికిత్స చేయించారు. ఈ సంఘటన గురించి చిత్ర వర్గాలు తెలుపుతూ విశాల్ ఫైట్ సన్నివేశంలో అనూహ్యంగా కిందపడిపోయారని, పెద్దగా దెబ్బలేమీ తగల్లేదన్నారు. చికిత్స అనంతరం కొంత విశ్రాంతి తీసుకోమని వైద్యులు సలహా ఇచ్చారని తెలి పారు. ఆ తరువాత విశాల్ యథాతథంగా షూటింగ్‌కు రెడీ అయ్యారని చెప్పారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







