తెలంగాణ వాసికి ఎడారి దారిలో ఆగని కన్నీళ్లు
- August 07, 2017
గల్ఫ్‌లో ఒంటెల కాపరిగా నగరవాసి యాతన
ఎడారి దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిన వారి కష్టాల కన్నీళ్లు ఆగడంలేదు. రోజుకో బాధితుడి వ్యథ వెలుగు చూస్తోంది. పాతనగరంలోని తాలాబ్ చంచలం డివిజన్ ఆమన్‌నగర్‌కు చెందిన సయ్యద్ సాదిక్ సౌదీ అరేబియాలో పడుతున్న ఇబ్బందులపై కుటుంబ సభ్యులు సోమవారం ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ దృష్టికి తీసుకెళ్లారు. అతడిని ఎలాగైనా కాపాడి స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. సాదిక్ గత ఏడాది జూన్ 24న సౌదీ వెళ్లాడు. అక్కడి రియాద్ నగరంలో ఓ వ్యక్తి వద్ద సహాయకుడిగా ఉద్యోగం ఉందని వెళ్లేముందు ఏజెంటు చెప్పాడు. కానీ అక్కడికి వెళ్లాక యజమాని మాత్రం జనావాసాలకు దూరంగా ఎడారి ప్రాంతంలో ఒంటెల కాపరిగా పంపించడంతో అతడి పరిస్థితి దారుణంగా మారింది. మండుటెండల్లో మాడిపోతూ... 11 నెలలుగా వేతనాలు లేక తీవ్ర దుర్భర పరిస్థితి అనుభవిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లాఖాన్ బాధితుని వివరాలను విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్విట్టర్లో పంపించారు.
అతడిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఎడారి ప్రాంతంలో సాదిక్‌ను మాసినగడ్డం, కమిలిపోయిన చర్మంతో దయనీయ స్థితిలో చూసిన కొందరు హైదరాబాద్ వాసులు అతని చిత్రాలను కుటుంబ సభ్యులకు పంపించడంతో ఈ విషయం వెలుగు చూసింది. అమ్జదుల్లాఖాన్ ఈ చిత్రాలనూ కేంద్రమంత్రికి పంపించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!







