ఈద్ అల్ అదా: ఆఫర్లలో 'ఎగిరిపోతే' ఎంత బాగుంటుంది!
- August 07, 2017
దుబాయ్‌కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్, ఈద్ అల్ అదా సెలవుల సందర్భంగా ఆకర్షణీయమైన ఫేర్ ఆఫర్స్‌ని వినియోగదారుల ముందుంచుతోంది. ఎమిరేట్స్ నెట్‌వర్క్ పరిదిలో ఆగస్ట్ 7 నుంచి ఆగస్ట్ 19 వరకు బుక్ చేసుకుంటే డిసెంబర్ 13 వరకు అద్భుతమైన ఆఫర్లతో తక్కువ ధరకే ప్రయాణించే వీలు కలుగుతుంది. విమాన ప్రయాణం 910 దిర్హామ్‌ల నుంచి ప్రారంభమవుతుంది ఈ ఆఫర్ కింద. ముంబై 910, బీరుట్ 940, అమ్మాన్ 990, కైరో 1,290, కొలంబో 1,310, బ్యాంకాక్ 2,090, హనోయ్ 2,470, 3,410 మారిషస్, లాస్‌ఏంజిల్స్ 4,950 దిర్హామ్‌లకు టిక్కెట్లను కొనుగోలు చేయొచ్చు. ఇవి ఎకానమీ క్లాస్ విమానాలు. అదే బిజినెస్ క్లాస్ విమానాలైతే ముంబై 3,300, పుకెట్ 10,150, మారిషస్ 10,570, తైపీ 11,400 దిర్హామ్‌లు మరికొన్ని డెస్టినేషన్లకు కూడా మెరుగైన ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆఫర్లను సొంతం చేసుకుని, సెలవుల సీజన్‌ని ఎంజాయ్ చేసెయ్యండి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







