మోదీ అమరావతి శంకుస్థాపన చేశారు
- October 22, 2015
చరిత్రలో కొత్త పుట... కొత్త అధ్యాయం...సువర్ణాక్షర లిఖితం. ఆంధ్రుల వైభవ దీప్తికి మరో మైలురాయి. నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 12.36-12.43 గంటల మధ్య మోదీ... అమరావతి శంకుస్థాపన చేశారు. ఈ ప్రధాన క్రతువు ముగిసిన అనంతరం ప్రధాని పూర్ణాహుతి, రత్నన్యాసం, శిలాన్యాసం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శంకుస్థాపన శిలా ఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, ఎంపీ సుజనా చౌదరి, గవర్నర్ నరసింహన్, జపాన్, సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రధాన వేదికకు పక్కనే ఏర్పాటు చేసిన అమరావతి గ్యాలరీని మోదీ సందర్శించారు. ఆ గ్యాలరీని ఆయన ఆసక్తిగా తిలకరించారు. ఆ తర్వాత రాజధాని మాన్టర్ ప్లాన్ ను అధికారులు... ప్రధానికి వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







