వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌

- August 11, 2017 , by Maagulf
వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్‌

బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. శనివారం నుంచి వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈనెల 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న శ్రీకృష్ణ జన్మాష్టమి, 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఈ 4 రోజులు బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఆన్‌లైన్, డిజిటల్‌ లావాదేవీలు యథావిధిగా సాగుతాయి.  
ఇప్పటికే అరకొర నగదు, పని చేయని ఏటీఎంలతో సమస్యలు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు వరుస సెలవుల రూపంలో ఇబ్బందులు పెరగనున్నాయి. మరోవైపు ఈనెల 25 నుంచి కూడా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. 25న వినాయక చవితి, 26న 4వ శనివారం, 27న ఆదివారం కావడంతో మూడు రోజులు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com