నెక్లెస్ రోడ్‌లో కూలిన తెలంగాణ పర్యాటక హెలీకాప్టర్

- August 11, 2017 , by Maagulf
నెక్లెస్ రోడ్‌లో కూలిన తెలంగాణ పర్యాటక హెలీకాప్టర్

హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పడం తో తెలంగాణ సర్కార్ ఊపిరి పీల్చుకుంది. హైదరాబాద్ నగరవాసుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జాయ్ రైడ్ నిర్వహించాలని భావించిన తెలంగాణ పర్యాటక శాఖ ఆగస్టు 10 మధ్యాహ్నం హుస్సేన్ సాగర తీరం వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
కార్యక్రమం ప్రారంభం అనంతం తొలి రౌండ్‌లో కొద్ది ఎత్తులో గాల్లోకి ఎగిరిన బెల్ 412 ట్విన్-ఇంజిన్ హెలీకాప్టర్ వెంటనే నెక్లెస్ రోడ్డుపై కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవలేదు. పది నిమిషాల పాటు హైదరాబాద్ భాగ్యనగరంపై 1,500 అడుగుల ఎత్తులో చక్కర్లు కొట్టి, సిటీలో పలు పర్యాటక ప్రాంతాలని ఆకాశంలోంచే చుట్టి రావడం ఈ జాయ్ రైడ్ ప్రత్యేకత. ఒక్కో రౌండ్ కోసం ఒకరి నుంచి రూ.2,495 ఫీజు వసూలు చేస్తారు. ఈ హెలీకాప్టర్‌లో ఒకేసారి 12 మంది ప్రయాణించేందుకు వీలుంటుంది.
కానీ ఈ ప్రమాదం తో నగర వాసులు ఎందులో ఎక్కి సిటీ చూడాలంటే భయపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com