యుఎఇ ఎడారిలో ఇరుక్కుపోయిన ఇరువురు యూరోపియన్ పర్యాటకులు

- August 12, 2017 , by Maagulf
యుఎఇ ఎడారిలో ఇరుక్కుపోయిన ఇరువురు  యూరోపియన్ పర్యాటకులు

" అసలే తెల్ల తోలు ...ఆపై భగ  భగ మండే వేసవికాలం... దీనికి తోడు ఎడారిలోదారితప్పి మోటార్ బైక్ పై ఎన్నో గంటల ప్రయాణం... దీంతో  ఇద్దరు యూరోపియన్ పర్యాటకులు మండే ఎండకు వడదెబ్బ కొట్టి  శోష వచ్చి అలసిపోయారు..ఎడారిలో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేకుండా  ద్వి చక్రవాహనాలలో పెట్రోల్ సైతం అయిపోయింది. ఇక మరణం తప్పదు అనుకొనే సమయంలో...వీరి ఇద్దరు కోసం భగవంతుడు పంపినట్లు ఒక ఎమిరాటీ వ్యక్తి  అక్కడకు వచ్చి వారిని ఆ భయానక వేసవి వాతావరణం నుంచి రక్షించాడు.  అలీ రషీద్  ఎమిరాటీ అనే వ్యక్తి  ఎడారిలో అతని 4x4 వాహనంలో వారిని రక్షించాడు. అయితే ఆ ఇద్దరు అతిసారం వ్యాధితో బాధపడుతున్నారని గ్రహించాడు. తీవ్రమైన ఎండలలో వారు వెళ్ళవల్సిన ఎడారి దారిని సైతం తప్పిపోయినట్లు గ్రహించాడు   ఎడారిలో గతంలో కొంత మంది నిర్మాణ బృందాలు పని చేస్తుండేవి కానీ వేసవి విరామ వేళలు అమలుకావడంతో మధ్యాహ్నం పనిని నిలిపివేశారు. దీంతో ఆల్  రషీద్ వెంటనే షార్జా పోలీసులను సహాయం కోసం పిలిచారు మరియు  గస్తీ  పోలీసుల వచ్చి వారిని రక్షించారు. ఆ ఇద్దరు eu రక్షించబడే వరకు వారికి ప్రథమ చికిత్స అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com