స్వాతంత్ర్య వేడుకల్లో ప్రసంగిస్తుండగా ఒడిశా సీఎంకు అస్వస్థత

- August 15, 2017 , by Maagulf
స్వాతంత్ర్య వేడుకల్లో ప్రసంగిస్తుండగా ఒడిశా సీఎంకు అస్వస్థత

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. భువనేశ్వర్‌లో స్వాతంత్య్రదినోత్సవ వేడుకులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది ఆయన్ను పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం సీఎం నివాసానికి తరలించారు. అక్కడ ఇద్దరు వైద్యులు ఆయనకి చికిత్స అందించారు.
ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. నవీన్‌ పట్నాయక్‌... ఈరోజు షెడ్యూల్‌ ప్రకారం అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారని సీఎం కార్యాలయ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com