వలసదారులకి మెడికల్ చెక్స్ తప్పనిసరి
- August 15, 2017
మనామా: బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ, కింగ్‌డమ్‌కి వచ్చే విదేశీయులకు మెడికల్ చెకప్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఆయా దేశాల్లోని జిసిసి స్టేట్స్ అప్రూవ్ చేసిన కేంద్రాల్లో ఈ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది వలసదారులు. గత డిసెంబర్‌లో బహ్రెయిన్‌లో జరిగిన జిసిసి లీడర్స్ సుప్రీం కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నిబంధన అమల్లోకి తెచ్చినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఎలక్ట్రానిక్ లింకేజ్ ద్వారా వలసదారుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సంపూర్ణ సమాచారం అప్‌డేట్ చేయబడ్తుందని అధికారులు తెలిపారు. అయితే రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు ఈ నిబంధన విషయంలో కొంత పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారిని ఎంపిక చేయడం ద్వారా ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందన్నది అధికార వర్గాల వాదనగా కనిపిస్తోంది. అనారోగ్య సమస్యలతో కార్మికులు ప్రాణాలు కోత్పోతుండడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే ఈ నిబంధన తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







