ఇద్దరు సినీ నటులను 2019 ఎన్నికల బరిలో దింపనున్న బీజేపీ
- August 15, 2017
కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ.. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పట్టుసాధించాలని భావిస్తున్నది. ఈ నేపద్యంలో సినీ గ్లామర్ కు వలవేసే ప్రయత్నాలను ఇప్పటి నుంచే మొదలు పెట్టింది. 2019 లో జరగబోయే ఎన్నికల్లో సినీ గ్లామర్ కోసం తమ పావులను కదుపుతున్నది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఇద్దరు సినీ ప్రముఖులను ఎన్నికల బరిలో నిలిపే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటి, బుల్లి తెర ఫ్యామిలీ షోకి వ్యాఖ్యాతగా చేసిన జీవితా రాజశేఖర్ తో పాటు.. ప్రముఖ నటుడు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా కు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి టికెట్లు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరికి నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ టికెట్స్ దక్కడం ఖాయం. కాగా ఏ నియోజక వర్గం నుంచి అనేది మాత్రం తెలియాల్సి ఉన్నది. శివాజీ రాజా తాను వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అంతేకాదు. బీజేపీ లో మరికొంతమంది ప్రముఖులను చేర్చుకొనేలా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







