20 అడుగుల మురుగునీటి గోతిలో పడిన బాలుడిని రక్షించిన పోలీసులు
- August 16, 2017
మన తెలుగు రాష్ట్రాలలో పూడ్చివేయబడని బోరు బావిలో పిల్లలు పడిపోవడం తరచూ జరుగుతుంటుంది. గల్ఫ్ ప్రాంతంలో సైతం బుడతలు డ్రైనేజీ గుంతలలో జర్రున జారిపోతున్నారు. అల్ మురిఫీయా ప్రాంతం అల్ ఐన్ లో బుధవారం ఒక మురుగునీటి గొయ్యిలో పడిపోయిన ఎమిరాటీ బాలుడిని పోలీసులు కాపాడారు. ఆ ప్రమాదం గురించి ఆపరేషన్ రూమ్ కు సాయంత్రం 5 గంటల సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే అల్ మక్ మరియు బస్నాడ్ పోలీసు స్టేషన్ల నుండి విపత్తు నివారణ జట్లు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొన్నాయి.అల్ ఐన్ నుండి పౌర రక్షణ బృందం 20 మీటర్ల లోతైన డ్రైనేజీ రంధ్రం నుండి ఆ బాలుడిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







