నటుడు శివాజీ రాజా తనయుడికి సినిమా ఛాన్స్

- August 16, 2017 , by Maagulf
నటుడు శివాజీ రాజా తనయుడికి సినిమా ఛాన్స్

" మా " అధ్యక్షుడు, క్యారక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా తనయుడు విజయ్ సినీ ఆరంగేట్రానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ లోని ఓ యాక్టింగ్ స్కూల్ లో నటన, డ్యాన్స్ లు నేర్చుకున్న విజయ్ కి ఆఫర్లు మెల్లగా వెల్లువెత్తుతున్నాయని సమాచారం. కొందరు నిర్మాతలు శివాజీ రాజాతో టచ్ లో ఉన్నారని, ఆయన అంగీకరిస్తే విజయ్ ని వెండి తెరకు పరిచయం చేస్తామని ప్రపోజల్స్ తెచ్చారట.
అయితే మొదట తనకు స్టోరీ నచ్చాలని, ఆ తరువాతే తన కొడుకుకు సూటయ్యే 
పాత్రను ఎంపిక చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తానని శివాజీ రాజా చెబుతున్నాడని అంటున్నారు. సీనియర్ నటులు తమ తనయులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, వారిని హీరోలుగా మారుస్తున్న ఈ రోజుల్లో శివాజీ రాజా కూడా చేరిపోయాడన్నమాటే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com