త్వరలో పవన్ త్రివిక్రమ్ ఫారిన్ టూర్
- August 16, 2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నిర్మాణం నెమ్మదిగా సాగుతోంది. రాజకీయాల్లోనూ బిజీగా ఉన్న పవన్, షూటింగ్ కు పూర్తి సమయం కేటాయించకపోవటమే సినిమా ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది.
షూటింగ్ వేగం పెంచాలని భావించిన చిత్రయూనిట్ త్వరలో ఓ భారీ ఫారిన్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు వేడుకలు ముగిసిన తరువాత విదేశాలకు వెళ్లనున్నారు. యూరప్ లో జరగనున్న ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను పవన్ పుట్టిన రోజు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







